Asaduddin Owaisi on Telangana Liberation Day: సెప్టెంబరు 17న హైదరాబాద్ పాతబస్తీలో తిరంగా యాత్ర నిర్వహించనున్నట్టు ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సెప్టెంబర్ 17 హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనమైన రోజు అని తెలిపారు. ఆ రోజున విమోచన దినోత్సవం జరపాలని కేంద్రం నిర్ణయించిందని, అలాకాకుండా సెప్టెంబర్ 17న జాతీయ సమగ్రత దినోత్సవం జరపాలని కోరారు. ఈమేరకు విమోచన దినోత్సవంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లేఖలు రాశామని తెలిపారు. తెలగాణ విమోచన కోసం హిందువులు, ముస్లింలు కలిసి పోరాడారని గుర్తు చేశారు. తురేబాజ్‌ఖాన్ వీరోచిత పోరాటం చేశారని వివరించారు. సెప్టెంబర్ 17న పాతబస్తీలో తిరంగాయాత్ర నిర్వహిస్తామని తెలిపారు. ఎంఐఎం నిర్వహించే బహిరంగ సభలో పార్టీ ఎమ్మెల్యేలంతా పాల్గొంటారని అసదుద్దీన్ ఒవైసీ వెల్లడించారు.
సెప్టెంబర్ 17న జాతీయ సమైక్యతా దినోత్సవం నిర్వహించాలి: అసదుద్దీన్ - అసదుద్దీన్ ఒవైసీ తాజా వార్తలు
Asaduddin Owaisi on Telangana Liberation Day: సెప్టెంబర్ 17 హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనమైన రోజు అని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. ఆ రోజున విమోచన దినోత్సవం జరపాలని కేంద్రం నిర్ణయించిందని, అలాకాకుండా సెప్టెంబర్ 17న జాతీయ సమగ్రత దినోత్సవం జరపాలని కోరారు. ఈ మేరకు విమోచన దినోత్సవంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లేఖలు రాశామని.. సెప్టెంబర్ 17న పాతబస్తీలో తిరంగాయాత్ర నిర్వహిస్తామని తెలిపారు.
'సెప్టెంబర్ 17న జాతీయ సమైక్యతా దినోత్సవంగా నిర్వహించాలి. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వసతులపై సర్వే చేయాలి. ముందే ఎంపిక చేసుకున్న పాఠశాలల్లో సర్వే చేయటం కాదు. అభివృద్ధి, ఆధునీకరణకు ఎవరూ వ్యతిరేకులు కాదు. జాతీయ సమైక్యతా దినోత్సవం నిర్వహిస్తే మేం పాల్గొంటాం. విమోచన, సమగ్రత మధ్య చాలా తేడా ఉంది. అందరినీ భాగస్వాములను చేస్తూ జాతీయ సమైక్యతా దినం జరపాలి. 8 ఏళ్లుగా మోదీ సర్కారు ఎందుకు ప్రకటించలేదు. దేశంలో భాజపా ప్రభుత్వం నిజాం పాలనను గుర్తు చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి.'- అసదుద్దీన్ ఒవైసీ, ఎంపీ
ఇవీ చదవండి: