గ్రేటర్ ఎన్నికల ప్రచారారానికి కేంద్రమంత్రులు కాదు.. ప్రధాని మోదీ సభ పెట్టి సత్తా ఏంటో నిరూపించుకోవాలని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ డిమాండ్ చేశారు. అక్బర్‌బాగ్ డివిజన్లో ప్రచారం నిర్వహించిన అసద్ స్థానిక ఎన్నికల ప్రచారానికి కేంద్ర మంత్రులు రావడం పట్ల తనదైన పద్దతిలో స్పందించారు.
దమ్ముంటే హైదరాబాద్‌లో సభ పెట్టండి: ప్రధానికి సవాల్
భాగ్యనగరంలో గ్రేటర్ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రధాని మోదీపై విమర్శలు సంధించారు. గ్రేటర్ ప్రచారానికి కేంద్రమంత్రులు కాకుండా.. మోదీ సభ పెట్ట సత్తా చాటాలని సవాల్ విసిరారు.
ప్రధాని మోదీకి సవాల్ విసిరిన అసదుద్దీన్
ప్రచారానికి వాళ్లను వీళ్లను పంపడం కాదు, ప్రధాని మోదీ సభ పెట్టాలని సవాలు విసిరారు. ఎవరి సత్తా ఏమిటో తేల్చుకుందామని అన్నారు. బిహార్ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 220 అసెంబ్లీ సెగ్మెంట్లలో గెలిచిన భాజపా.. ఏడాదిన్నరకే 75 సీట్లకు పడిపోయిందని ఎద్దేవా చేశారు. సీట్లు తగ్గినపుడు పరిస్థితి ఎలా ఉందో అర్ధం కాలేదా అని ప్రశ్నించారు.
ఇదీ చూడండి :41 డివిజన్లలో.. 49 మంది నేరచరితులు...