Blood Donation స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా... రాష్ట్రవ్యాప్తంగా రక్తదాన కార్యక్రమాలు నిర్వహించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరంలో... ఎమ్మెల్సీ కవిత రక్తదానం చేశారు. సనత్ నగర్‌లోని ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన శిబిరాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఇబ్రహీంబాగ్ వద్ద ఆర్మీ సెంటర్లో 200 మంది జవాన్లు రక్తదానం చేశారు. రాజేంద్రనగర్ ప్రభుత్వాసుపత్రిలో తెరాస నేతలు, ప్రజలు రక్తదానంలో పాల్గొన్నారు.
స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రక్తదాన శిబిరాల నిర్వహణ - రక్తదానం చేసిన ప్రజాప్రతినిధులు
Blood Donation స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. కొన్ని చోట్ల ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాల్లో పలువురు ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరంలో ఎమ్మెల్సీ కవిత రక్తదానం చేశారు.
మంచిర్యాల జిల్లా ప్రధాన ఆసుపత్రిలో... ఉద్యోగులు, ఔత్సాహికులు, నిర్మల్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో కలెక్టర్ ముషార్రఫ్ ఫారూఖీ రక్తదానం చేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ఎమ్మేల్యే షకీల్ పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రిలో... యువకులు 100యూనిట్ల రక్తాన్ని ఇచ్చినట్లు ఆర్డీవో తెలిపారు. మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రిలో కలెక్టర్‌శశాంక... స్వయంగా రక్తదానం చేశారు. హనుమకొండ కలెక్టర్ కార్యాలయంలో రక్తదానం చేసిన వారికి మంత్రి ఎర్రబెల్లి బహుమతులు ప్రధానం చేశారు. సిద్ధిపేట క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు... మహనీయుల స్ఫూర్తిని స్మరిస్తూ రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నాని చెప్పారు. ప్రమాదాల్లో గాయపడిన వారు, తలసేమియా బాధితులకు ఆ రక్తం అందిస్తామని హరీశ్ తెలిపారు.
ఇవీ చదవండి: