ప్రైవేటులో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిన పుణ్యమా అని.... రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులపై గతంలో ఎన్నడూ లేనంతగా భారం పడుతోంది. అసలే అరకొర సిబ్బందితో వైద్య సేవలు అందిస్తున్న సర్కారు దవాఖానాలకు ఇప్పుడు మూలిగే నక్కపై తాడిపండు పడినట్లు అయ్యింది. అసలే జ్వరాలు ప్రభలే సమయం కావటం వల్ల భాగ్యనగరంలోని ఉస్మానియా, గాంధీ, నిమ్స్ ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి.
నిన్న ఒక్క రోజే గాంధీ ఆస్పత్రికి సుమారు 2500 మందికి పైగా రోగులు వచ్చారు. సుమారు నాలుగు గంటలకు పైగా క్యూలో నిల్చోవాల్సిన దుస్థితి. అత్యవసర పరిస్థితిలో ఉన్నవారికి ప్రాణ రక్షణ కరువైంది. జిల్లాల నుంచి వచ్చిన వారికి సరైన వైద్యం అందక నానా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా డయాలసిస్ రోగుల పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారుతోంది. ఒక్కో డయాలసిస్కి 3 నుంచి ఐదు వేల రూపాయలు చెల్లించలేక అవస్థలు పడుతున్నారు.
ఈ నేపథ్యంలో గాంధీ ఆస్పత్రిలో ప్రస్తుతం ఉన్న 11 కౌంటర్లతోపాటు... మరో ఐదు కౌంటర్లు నూతనంగా ఏర్పాటు చేసి.... ఎప్పుడు రోగులు వచ్చినా తక్షణం వారికి సేవలు అందిస్తున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ స్పష్టం చేశారు.
విఫలమైన చర్చలు...