చూడటానికి అచ్చం సినిమా స్థాయి సాంకేతికతలాగానే అనిపిస్తున్న దృశ్యాలను చరవాణితో చిత్రీకరించారంటే నమ్మగలరా? లఘు చిత్రం తీయాలంటే కనీసం తక్కువ ధరలో లభించే వీడియో కెమెరా అయినా ఉండాలి. ఇవేమీ లేకుండానే సినిమా తరహాలో.. డబ్బింగ్, మ్యూజిక్‌తో పాటు ఎడిటింగ్ స్మార్ట్ ఫోన్‌తోనే చేస్తూ.. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా మెంటాడ మండలం గుర్లకు చెందిన బూర్ల గణేశ్ అబ్బురపరుస్తున్నాడు.
చదువుపై ఆసక్తి లేక ఎనిమిదో తరగతిలోనే చదువుకు స్వస్తి పలికి.. తర్వాత దూరవిద్యలో పదో తరగతి పూర్తిచేశాడు గణేశ్. ఫోటోగ్రఫీ, వీడియో ఎడిటింగ్‌పై ఆసక్తితో హైదరాబాద్‌లోని బీఎఫ్ఎక్స్లో చేరాడు. కరోనా పరిస్థితులతో స్వస్థలానికి వచ్చాడు. నెల్లూరుకు చెందిన కుర్రాళ్లు.. ఓ చిత్రంలోని పోరాట దృశ్యాలపై చేసిన లఘుచిత్రం గణేశ్‌ను ఆకర్షించింది. తాను కూడా ఏదైనా కొత్తగా ప్రయత్నించాలనుకున్నాడు.