తెలంగాణ

telangana

ETV Bharat / city

గూడు చేరని జాలర్ల గోడు

వారంతా బతుకుదెరువు కోసం సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు... లాక్‌డౌన్‌ కారణంగా చెన్నైలో చిక్కుకుపోయారు. సొంత గూడు చేరడానికి సాహసం చేసి మరి పడవల్లో బయలుదేరారు. కానీ సముద్ర అల్లకల్లోలంగా మారటంతో వారి గమ్యాన్ని చేరలేకపోయారు. అతికష్టం మీద ఏపీలోని కృష్ణా జిల్లా నాగాయలంక మండలం ఎదురుమెుండికి చేరుకుని...ప్రాణాలు నిలబెట్టుకున్నారు.

fishermans problems
గూడు చేరని జాలర్ల గోడు

By

Published : Apr 28, 2020, 12:20 PM IST

ఉత్తరాంద్ర జిల్లాలకు చెందిన మత్స్య కారులు వేటకోసం సముద్రంలోకి వెళ్ళారు. లాక్ డౌన్ ప్రభావంతో చెన్నైలో చిక్కుకుపోయారు. అక్కడ కనీస సౌకర్యాలు కూడా లేకపోవటంతో...వారంతా సముద్రమార్గం ద్వారా తమ ప్రాంతాలకు వెళ్లాలని నిశ్చయించుకుని...బయలుదేరారు. తుపానులు, వర్షం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారటంతో... వారు నదీమార్గం గుండా కృష్ణా జిల్లా నాగాయలంక మండలం ఎదురుమెుండికి చేరుకున్నారు.

ఇప్పటికే 5 బోట్లలో సుమారు 90 మత్స్యకారులు వచ్చారు. తమకు ఆహారం, ఉండటానికి వసతి ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. కాగా ఈ గంగపుత్రుల రాకతో ఎదురుమొండి దీవుల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.

ఇవీ చూడండి:భళా ఈశాన్య భారతం- కరోనా రహితంగా ఆ ఐదు రాష్ట్రాలు

ABOUT THE AUTHOR

...view details