రెండు రోజుల కిత్రం ప్యాట్నీ సెంటర్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుండగా ఒకవ్యక్తి సీఎం కేసీఆర్ను తిడుతూ హల్చల్ చేశాడు. ఈ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని.. అతన్ని కఠినంగా శిక్షించాలని మహంకాళి డీఐ పురుషోత్తంను కలిసి తెరాస కార్యకర్తలు వినతిపత్రం అందజేశారు. సీఎం కేసీఆర్ గురించి సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో దూషించే వారిపై కూడా చర్యలు తీసుకోవాలని తెరాస గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు సుధీర్ రెడ్డి కోరారు. ముఖ్యమంత్రిని అసభ్య పదజాలంతో దూషించిన వ్యక్తిని అరెస్టు చేయాలని విన్నవించారు. వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
'దుర్భషలాడిన వ్యక్తిని అరెస్ట్ చేయండి' - తెరాస కార్యకర్తల ఫిర్యాదు
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డ వ్యక్తి తెలంగాణ ముఖ్యమంత్రిని తిట్టడాన్ని తెరాస కార్యకర్తలు తప్పుబట్టారు. అతన్ని కఠినంగా శిక్షించాలంటూ మహంకాళి పోలీసులకు వినతిపత్రం అందించారు.
తెరాస కార్యకర్తల ఫిర్యాదు