తెలంగాణ

telangana

ETV Bharat / city

బ్లాక్​ఫంగస్ మందులను అక్రమంగా అమ్ముతున్న ముఠా అరెస్ట్​ - గుంటూరు జిల్లా తాజా వార్తలు

బ్లాక్​ఫంగస్ వ్యాధి నియంత్రణలో కీలకంగా మారిన ఆంపోటెరాసిన్ బి ఇంజెక్షన్లను బ్లాక్​ మార్కెట్​లో విక్రయిస్తున్న ఎనిమిది మందిని ఏపీలోని గుంటూరు పోలీసులు పట్టుకున్నారు. వారినుంచి 46 అంపోటెరాసిన్ బి ఇంజెక్షన్లు, 3 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.

amphotericin B injections selling illegally at guntur
amphotericin B injections selling illegally at guntur

By

Published : Jun 20, 2021, 5:48 PM IST

బ్లాక్ ఫంగస్ వ్యాధితో భయాందోళనలు నెలకొన్నవేళ... వారి అవసరం, కష్టాన్నే కాసులుగా మార్చుకుంటున్నారు కొందరు వ్యక్తులు. బ్లాక్ ఫంగస్ నియంత్రణలో కీలకంగా మారిన ఆంపోటెరాసిన్ బి ఇంజెక్షన్లను నల్లబజారులో విక్రయిస్తూ ఎనిమిది మందిని ఏపీలోని గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 46 అంపోటెరాసిన్ బి ఇంజెక్షన్లతో సహా రూ. 3 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు రేంజ్ డీఐజీ త్రివిక్రమ్ వర్మ, అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు.

ఈ ఇంజెక్షన్లను హోల్ సేల్ మార్కెట్​లో విక్రయించేవారు... మెడికల్ రిప్రజెంటేటివ్​లతో ఏకమై నల్లబజారులో విక్రయిస్తున్నట్లు డీఐజీ త్రివిక్రమ్ వర్మ చెప్పారు. గరిష్ఠ చిల్లరధర ప్రకారం రూ. 1700 లభించే అంపోటెరాసిన్ ఇంజెక్షన్లను.. నల్లబజారులో రూ.25వేలకు అమ్ముతున్నారని డీఐజీ వివరించారు.

ఇదీ చదవండి:Cm Kcr: నా కళ్లల్లో ఆనంద భాష్పాలు వస్తున్నాయ్..

ABOUT THE AUTHOR

...view details