తెలంగాణ

telangana

ETV Bharat / city

కరోనాకు ఆయుర్వేద మందు.. పంపిణీకి సన్నాహాలు

ఏపీలోని నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో.. కరోనాకు ఇస్తున్న హెర్బల్ మెడిసిన్ ఆ రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఇది అశాస్త్రీయం అని చెబుతున్న అధికారులు.. మందు తీసుకున్న వారిని విచారించామని, ఎవరికీ ఎటువంటి నష్టం జరగలేదని తమ నివేదికలో తెలిపారు. ఏపీ ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇవ్వలేదు.. కానీ ప్రజల కోరిక మేరకు, ఎమ్మెల్యే కాకాని ఆధ్వర్యంలో రేపటి నుంచి తిరిగి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

herbal medicine, herbal medicine for corona, medicine for corona in ap
కరోనాకు ఆయుర్వేద మందు, కరోనాకు మందు, కొవిడ్​కు మందు

By

Published : May 21, 2021, 10:43 AM IST

కరోనాకు ఉచితంగా ఆయుర్వేద మందు ఇస్తున్నారన్న విషయం తెలుసుకుని.. ఏపీలోని నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంకు ప్రజలు వేలాదిగా తరలివెళ్తున్నారు. 15 రోజుల్లోనే సుమారు 50 వేల మంది ఔషధం కోసం వచ్చారు. కొవిడ్ నిబంధనలు పాటించకపోవడంతో.. మందు పంపిణీ నిలిపివేయాలని అధికారులు ఆదేశించారు. కానీ ప్రజలు, ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి ఒత్తిడి మేరకు తిరిగి పంపిణీ చేయాలని నిర్ణయించారు.

కరోనాకు ఆయుర్వేద మందు

వన మూలికలతోనే...

ఆనందయ్య అనే వ్యక్తి గత కొన్నేళ్లుగా అనేక వ్యాధులకు వన మూలికలతో తయారు చేసిన ఆయుర్వేద మందులు ఇస్తూ ఉన్నారు. ప్రస్తుతం కొవిడ్ విలయం సృష్టిస్తుండగా.. దానికి సైతం మందు తయారు చేశారు. అల్లం, తాటి బెల్లం, తేనె, నల్ల జీలకర్ర, తోక మిరియాలు, పట్టా, లవంగాలు, వేప ఆకులు, నేరేడు చిగుర్లు, మామిడి చిగుర్లు, నేల ఉసిరి, కొండ పల్లేరుకాయలు, బుడ్డ బుడస ఆకులు, పిప్పింట ఆకులు, తెల్లజిల్లేడు, పూల మొగ్గలు, ముళ్ల వంకాయలతో ఔషధం తయారు చేస్తున్నట్లు ఆ వైద్యుడు తెలిపాడు.

అందరి నోటా సంతృప్తే...

ఏపీతో పాటు పాటు తమిళనాడు, తెలంగాణ నుంచి సైతం జనాలు భారీగా తరలిరావడంతో అధికారులు స్పందించారు. పంచాయతీరాజ్, వైద్యారోగ్యశాఖ, ఆర్డీవో, ఆయుర్వేద వైద్యులు, స్థానిక ఎండీవో, తహసీల్దార్ మొదలైన జిల్లా స్థాయి అధికారులు విచారణ జరిపారు. వారి నివేదికను కలెక్టర్ చక్రధర్ బాబు లోకాయుక్తకు ఇచ్చారు. మందు వాడిన బాధితులతో మాట్లాడామని.. అందరూ ఆయుర్వేద మందుపై పూర్తి స్థాయిలో సంతృప్తిని వ్యక్తం చేశారని అందులో వెల్లడించారు. ఈ ఔషధంతో ఎలాంటి ఇబ్బంది పడలేదని చెప్పారు. ఆయుర్వేద చికిత్స ప్రక్రియ శాస్త్రీయంగా నిరూపితం కావాల్సి ఉందన్నారు. వైద్యం, మందులు అందించే చోట కొవిడ్ నిబంధనలు పాటించడం లేదని పేర్కొన్నారు. మందు పంపిణీ చేయడం పునరుద్ధరించాలని.. వైకాపా ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీమంత్రి సోమిరెడ్డి కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details