జీహెచ్ఎంసీ పాలకమండలి సభ్యుల ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. గురువారం బల్దియా మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనున్న నేపథ్యంలో.. కౌన్సిల్ హాల్‌ను ఎస్ఈసీ పార్థసారథి పరిశీలించారు.
బల్దియా పాలకమండలి ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు - Hyderabad district election officer
గురువారం జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. దీనికి సంబంధించి బల్దియా ఎన్నికల అధికారి లోకేశ్ కుమార్‌తో కలిసి ఎస్ఈసీ పార్థసారథి జీహెచ్ఎంసీ కౌన్సిల్ హాల్‌ను పరిశీలించారు.
బల్దియా పాలకమండలి ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు
గురువారం ఉదయం 11 గంటలకు జీహెచ్ఎంసీ పాలకమండలి కొలువుదీరనుంది. కరోనా నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు గ్రేటర్ ఎన్నికల అధికారి లోకేశ్ కుమార్ తెలిపారు.
- ఇదీ చూడండి :నాడు ఏకగ్రీవ జోరు.. నేడు పోరు!