గణతంత్ర దినోత్సవ వేడుకలు హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేడు ఉదయం జరగనున్న ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం సాయుధ బలగాల గౌరవవందనం స్వీకరిస్తారు.
గణతంత్ర వేడుకకు ఏర్పాట్లు పూర్తి.. ఎట్హోం కార్యక్రమం రద్దు - తెలంగాణలో ఎట్హోం కార్యక్రమం రద్దు
గణతంత్ర వేడుకకు హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్స్ ముస్తాబైంది. తమిళిసై సౌందరరాజన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా రాజ్భవన్లో ఎట్హోం కార్యక్రమాన్ని నిర్వహించడం లేదు.
గణతంత్ర వేడుకకు ఏర్పాట్లు పూర్తి.. ఎట్హోం కార్యక్రమం రద్దు
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. కరోనా నేపథ్యంలో అందుకు అనుగుణంగా అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా రాజ్భవన్లో ఎట్హోం కార్యక్రమాన్ని జరపడం లేదు.
ఇవీచూడండి:'సంస్కరణలపై అనుమానాలు సహజం- రైతు సంక్షేమమే ధ్యేయం'
Last Updated : Jan 26, 2021, 12:02 AM IST