మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర ఆలయం ముస్తాబైంది. విద్యుత్ దీపాలంకరణలతో పాటు, వివిధ పుష్పాలు, ఫలాలతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు.
మహాశివరాత్రి వేడుకలకు సిద్ధమైన శ్రీకాళహస్తీశ్వర ఆలయం
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీకాళహస్తి మహాశివరాత్రి పండుగకు సిద్ధమైంది. విద్యుత్ దీపాలంకరణలతో పాటు, వివిధ పుష్పాలతో ఆలయాన్ని అలంకరించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు.
మహాశివరాత్రి వేడుకలకు సిద్ధమైన శ్రీకాళహస్తి క్షేత్రం
భక్తులందరికీ దర్శనం కల్పించాలనే లక్ష్యంతో మహాలఘు దర్శనం అమలు చేశారు. సర్వదర్శనం, ప్రత్యేక దర్శనాలకు వేరువేరుగా క్యూ లైన్లు, ప్రసాదాల పంపిణీకి వీలుగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: శివరాత్రికి సిద్ధమైన రాష్ట్రంలోని ఆలయాలు