తెలంగాణ

telangana

ETV Bharat / city

అలరించిన ఆర్మీ సింఫోనీ బ్యాండ్ ప్రదర్శన - హైదరాబాద్‌ తాజా వార్తలు

హైదరాబాద్‌ దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జిపై ఏర్పాటు చేసిన ఆర్మీ సింఫోనీ బ్యాండ్ ప్రదర్శన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టకుంది. ఆర్మీ ఆర్డినెన్స్‌ కోర్‌ బృందం ఆధ్వర్యంలో 35 మంది జవాన్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశభక్తి గీతాలతో పాటు పలు తెలుగు, హిందీ సినీ గీతాలను ఆలపించారు.

Army Symphony Band performs on Durgam Pond Cable Bridge in Hyderabad
అలరించిన ఆర్మీ సింఫోనీ బ్యాండ్ ప్రదర్శన

By

Published : Feb 15, 2021, 1:48 PM IST

హైదరాబాద్‌ దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జిపై 'స్వర్ణిమ విజయ్‌ వర్ష' పేరిట నిర్వహించిన గోల్డెన్ జూబ్లీ వేడుకలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆర్మీ ఆర్డినెన్స్‌ కోర్‌ బృందం ఆధ్వర్యంలో దాదాపు 35 మంది జవాన్లు ఆర్మీ సింఫోనీ బ్యాండ్ ప్రదర్శన చేశారు. పాకిస్తాన్​తో జరిగిన యుద్ధంలో ఇండియా విజయం సాధించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశభక్తి గీతాలతో పాటు పలు తెలుగు, హిందీ సినీ గీతాలను ఆలపించి అలరించారు.

అలరించిన ఆర్మీ సింఫోనీ బ్యాండ్ ప్రదర్శన

ప్రజల ప్రాణ రక్షణ కోసం జవాన్లు నిరంతరం పోరాటం చేస్తారని ఆర్మీ మేజర్‌ జనరల్‌ ఆర్‌కే సింగ్‌ అన్నారు. ఎంతో శ్రవ్యంగా, మధురంగా పలు గీతాలను ఆలపించిన ఆర్మీ జవాన్లు.. తమ ప్రాణాలనూ చిరునవ్వుతో ఆర్పిస్తారన్నారు. మరణిస్తారని తెలిసినా పోరాటంలో వెన్నుచూపడం ఉండదన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అరవింద్‌ కుమార్‌, ఆర్మీ మేజర్‌ జనరల్‌ ఆర్‌కే సింగ్‌, ఆర్మీ అధికారులు, జవాన్లు, తదితరలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: నూతన సాగు చట్టాలతో రైతులకు స్వేచ్ఛ: కిషన్​ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details