తెలంగాణ

telangana

ETV Bharat / city

'సీఎం గారూ.. నేను దేశాన్ని కాపాడుతుంటే.. నా ఇంటిని కూల్చేశారు..'

ఆర్మీలో సేవలందిస్తూ దేశాన్ని కాపాడే తాను... సొంత ఇంటినే కాపాడుకోలేకపోయానని ఓ జవాను ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో నరసరావుపేటలోని తన ఇంటిని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని గోవిందరెడ్డి అనే ఆర్మీ జవాను వాపోయారు. "ముఖ్యమంత్రి జగన్ గారు మీరే న్యాయం చేయాలి" అంటూ జవాను విడుదల చేసిన వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది.

'దేశాన్ని కాపాడే నేను... నా ఇంటిని కాపాడుకోలేకపోయాను'
'దేశాన్ని కాపాడే నేను... నా ఇంటిని కాపాడుకోలేకపోయాను'

By

Published : Dec 5, 2020, 10:50 PM IST

'దేశాన్ని కాపాడే నేను... నా ఇంటిని కాపాడుకోలేకపోయాను'

"నా ఇల్లును కూల్చేశారు... సీఎం జగన్మోహన్​రెడ్డి గారు న్యాయం చెయ్యండి" అంటూ ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన ఓ ఆర్మీ జవాన్​ చేసిన వీడియో వైరల్​గా మారింది. గుర్తుతెలియని వ్యక్తులు తన ఇంటిని కూల్చారంటూ గోవిందరెడ్డి అనే ఆర్మీ జవాను వీడియో ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు.

గత 18 ఏళ్లుగా ఆర్మీలో సేవలందిస్తూ... 2010లో నరసరావుపేటలోని బరంపేటలో స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకున్నానని తెలిపారు. ఇటీవల మున్సిపల్ అధికారుల పేరు చెప్పి కొందరు వ్యక్తులు తన ఇంటిని పూర్తిగా కూల్చివేశారని ఆయన ఆరోపించారు. ఏ అధికారంతో తన ఇంటిని కూల్చారని మున్సిపల్ అధికారులను అడిగితే.. తాము కూల్చలేదని బుకాయిస్తున్నారన్నారు.

స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి మంచి పేరు ఉందని.. ఆయన ఇల్లు తన కూల్చి ఉండరని భావిస్తున్నానని తెలిపారు. ఈ విషయమై తనకు న్యాయం చేయాలంటూ... గుంటూరు జిల్లా కలెక్టర్​ను కలిసి వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. దేశాన్ని కాపాడేందుకు ఆర్మీలో కష్టపడుతున్న తాను.. నరసరావుపేటలో ఇంటిని కాపాడుకోలేకపోయానని జవాను గోవిందరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్​ తనకు న్యాయం జరిగేలా చూడాలని అభ్యర్థించారు.

ఈ విషయంపై నరసరావుపేట మున్సిపల్ కమీషనర్ రామచంద్రారెడ్డిని వివరణ కోరగా... ఆర్మీ జవాను గోవిందరెడ్డి కొనుగోలు చేసిన స్థలం ప్రభుత్వ భూమిగా తెలిపారు. అతనికి స్థలం అమ్మిన మధ్యవర్తులు ఆ స్థలానికి వేరే సర్వే నెంబర్ వేసి రిజిస్ట్రేషన్ చేసి అతనిని మోసం చేశారన్నారు. ఆ స్థలం రజకుల ఖానా కింద కేటాయించి ఉందన్నారు. మున్సిపల్ అధికారులెవరూ ఆ ఇంటిని కూల్చలేదని తెలిపారు.

ఇదీచదవండి: ఆశల పల్లకీలో... గ్రేటర్ పీఠంపై సర్వత్రా ఉత్కంఠ!

ABOUT THE AUTHOR

...view details