తెలంగాణ

telangana

ETV Bharat / city

'ఇప్పటికీ హెరిటేజ్ కమిటీ ఏర్పాటు కాలేదు' - arguments on erramanjil buildings in high court

ఎర్రమంజిల్​ భవనాల కూల్చివేతపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్​ల తరఫున సీనియర్​ న్యాయవాది నిరూప్​రెడ్డి వాదనలు వినిపించారు. హెచ్​ఎండీఏ చట్టంలో చారిత్రక, వారసత్వ కట్టాడాల మధ్య తేడాను సరిగా నిర్వచించలేదని.. అందువల్ల ఎర్రమంజిల్​ భవనాలకు రక్షణ కొనసాగుతుందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం ఈనెల 5కు విచారణ వాయిదా వేసింది.

'ఇప్పటికీ హెరిటేజ్ కమిటీ ఏర్పాటు కాలేదు'

By

Published : Aug 2, 2019, 6:02 PM IST

Updated : Aug 2, 2019, 6:18 PM IST

'ఇప్పటికీ హెరిటేజ్ కమిటీ ఏర్పాటు కాలేదు'

ఎర్రమంజిల్ భవనాల కూల్చివేతపై దాఖలైన పిటిషన్లపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ హెరిటేజ్ చట్టం రాజ్యాంగ విరుద్ధంగా, అసంబద్ధంగా ఉందని హైదరాబాద్ జిందాబాద్ సంస్థ తరఫున సీనియర్ న్యాయవాది నిరూప్ రెడ్డి వాదనలు వినిపించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ హెరిటేజ్ కమిటీ ఏర్పాటు కాలేదని పేర్కొన్నారు. వారసత్వ కట్టడాల జాబితాను ఇప్పటికీ రూపొందించలేదని, చట్టాన్ని అమలు చేసే యంత్రాంగాన్ని కూడా సర్కారు ఏర్పాటు చేయలేదని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.

హెచ్​ఎండీఏ ప్రకారమే రక్షణ...

చారిత్రక, వారసత్వ కట్టడాలకు మధ్య తేడాను చట్టంలో సరిగా నిర్వచించలేదన్నారు. హెచ్ఎండీఏ చట్టం ప్రకారం ఎర్రమంజిల్ భవనాలకు రక్షణ కొనసాగుతుందన్నారు. వారసత్వ కట్టడాల జాబితా, మాస్టర్ ప్లాన్​ను మార్చాలంటే నిర్దిష్ట విధానం అనుసరించాల్సిందేని వాదించారు. ఇందుకు సంబంధించిన సుప్రీంకోర్టు, వివిధ హైకోర్టుల తీర్పులను సమర్పించారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 5కు వాయిదా వేసింది.

ఇవీ చూడండి: నాలుగోసారి విజయవంతంగా చంద్రయాన్​-2 కక్ష్య పెంపు

Last Updated : Aug 2, 2019, 6:18 PM IST

ABOUT THE AUTHOR

...view details