తెలంగాణ

telangana

ETV Bharat / city

దేశంలో ఏమైనా ఆర్థిక ఎమర్జెన్సీ ఉందా: ఏపీ హైకోర్టు

రాష్ట్రంలో ఆస్తులు అమ్మి నిధులు సమకూర్చుకోవలసిన పని ఉందా.. అని ఏపీ హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మిషన్ బిల్డ్ ఏపీ పేరిట జరుగుతున్న భూముల విక్రయంపై దాఖలైన పిటిషన్లను ఏపీ హైకోర్టు విచారించింది. దేశంలో ఏమైనా ఆర్థిక ఎమర్జెన్సీ ఉందా అని అడిగిన ధర్మాసనం.. కరోనా సమయంలో ఎక్కువ రేటు పెట్టి మద్యం కొనుగోలు చేసిన జనాలకు ప్రభుత్వం కృతజ్ఞతలు చెప్పాలని వ్యాఖ్యలు చేసింది.

Hight court comments on Mission Build AP
దేశంలో ఏమైనా ఆర్థిక ఎమర్జెన్సీ ఉందా: ఏపీ హైకోర్టు

By

Published : Dec 11, 2020, 5:18 PM IST

మిషన్ బిల్డ్ ఏపీ పేరిట భూముల విక్రయంపై ఏపీ హైకోర్టులో వాదనలు జరిగాయి. ఆస్తులను అమ్ముకుని ప్రభుత్వాన్ని నడిపించాల్సిన పరిస్థితులు ఉన్నాయా అని ప్రశ్నించింది. మిషన్ బిల్డ్ ఏపీ పేరుతో జరుగుతున్న ప్రభుత్వ ఆస్తుల అమ్మకాన్ని నివారించాలంటూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ రాకేశ్​ కుమార్, జస్టిస్ రమేశ్​ల నేతృత్వంలోని ధర్మాసనం.. విచారణ చేస్తోంది. దేశంలో ఆర్థిక ఎమర్జెన్సీ ఉందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కరోనా సమయంలో అధిక ధరకు మద్యం కొనుగోలు చేసి రాష్ట్రానికి ఆదాయం సమకూర్చిన మందుబాబులకు కృతజ్ఞతలు చెప్పాలిందేనని వ్యాఖ్యలు చేసింది.

దేశంలో ఏ ప్రభుత్వం చేయనన్ని సంక్షేమ కార్యక్రమాలను ఏపీ ప్రభుత్వం చేస్తోందని ప్రభుత్వ తరపు న్యాయవాది చెప్పగా.. మీరెంత బాగా చేస్తున్నారో అందరికి తెలుసని హైకోర్టు పేర్కొంది. మిషన్ బిల్డ్ ఏపీ పేరుతో జరుగుతున్న ప్రభుత్వం ఆస్తుల అమ్మకాన్ని నివారించాలని 10 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై కౌంటర్లు దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. కేసు తదుపరి విచారణ డిసెంబర్ 17కి వాయిదా పడింది.

ఇదీ చదవండి;అగ్నితో ఆటలొద్దు: సీఎంకు గవర్నర్​ వార్నింగ్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details