తెలంగాణ

telangana

ETV Bharat / city

సుప్రీం స్టే ఇస్తేనే.. 'రాజ్యాంగ విచ్ఛిన్నం'పై విచారణ ఆపుతాం: హైకోర్టు - Andhra pradesh latest news

ఏపీలో రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందా? లేదా? అనే అంశంపై విచారణను వాయిదా వేయాలని ఏపీ ప్రభుత్వం హైకోర్టును కోరింది. ఇప్పటికే సుప్రీంలో ఎస్‌ఎల్‌పీ దాఖలు చేశామని వివరించింది. అయితే ప్రభుత్వ అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది.

సుప్రీం స్టే ఇస్తేనే.. 'రాజ్యాంగ విచ్ఛిన్నం'పై విచారణ ఆపుతాం: హైకోర్టు
సుప్రీం స్టే ఇస్తేనే.. 'రాజ్యాంగ విచ్ఛిన్నం'పై విచారణ ఆపుతాం: హైకోర్టు

By

Published : Dec 16, 2020, 4:21 PM IST

ఏపీలో 'రాజ్యాంగ విచ్ఛిన్నం' జరిగిందా? లేదా? అనే అంశంపై హైకోర్టులో వాదనలు కొనసాగాయి. దీనిపై విచారణను వాయిదా వేయాలని ఏపీ ప్రభుత్వ తరఫు న్యాయవాది కోరారు. ఇప్పటికే సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్(ఎస్‌ఎల్‌పీ) దాఖలు చేశామని ఆయన వెల్లడించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ఎస్‌ఎల్‌పీపై సర్వోన్నత స్థాయస్థానం స్టే ఉత్తర్వులిస్తే విచారణ ఆపుతామని తేల్చి చెప్పింది. ప్రస్తుతానికి వాదనలు వినిపించాలని ఆదేశించింది. దీనిపై విచారణ గురువారానికి వాయిదా వేసింది.

పోలీసులు చట్ట ఉల్లంఘనలపై దాఖలైన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్లపై హైకోర్టు విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. అక్టోబర్‌ 1న విచారణ జరిపిన ధర్మాసనం.. ఏపీలో రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందా? లేదా? అనే విషయాన్ని తేలుస్తామని ఉత్తర్వులిచ్చింది.

ఇదీ చూడండి:బావిలో పడిన గజరాజు- జోరుగా సహాయక చర్యలు

ABOUT THE AUTHOR

...view details