శ్రీకాకుళం నగరంలో పూర్తిస్థాయి లాక్‌డౌన్ అమలులో ఉన్నందున.. అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో దర్శనాలను నిలిపివేశారు. జిల్లా కలెక్టర్ నివాస్ ఆదేశాల మేరకు సోమవారం నుంచి ఈనెల 31వ తేదీ వరకు దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఈవో హరి సూర్యప్రకాష్ తెలిపారు. ఈ విషయాన్ని దూర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు గమనించాలని కోరారు. స్వామి వారికి నిత్యం జరిగే పూజా కార్యక్రమాలు ఏకాంతంగా జరుగుతాయన్నారు.
అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం మూసివేత - అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం
ఏపీలోని శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో సోమవారం నుంచి ఈనెల 31వరకు దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఆలయ సిబ్బంది తెలిపారు. శ్రీకాకుళంలో లాక్‌డౌన్ అమల్లో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని ఆలయ ఈవో కోరారు.
![అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం మూసివేత అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం మూసివేత](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8095845-232-8095845-1595230266225.jpg)
అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం మూసివేత