APTF leaders Protest : ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఆందోళన ఫలితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిగివచ్చి చర్చలు జరిపినా.. డిమాండ్లను సాధించుకోవడంలో విఫలమయ్యామని ఏపీటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భానుమూర్తి, పాండురంగ వరప్రసాదరావులు శనివారం రాత్రి పేర్కొన్నారు. చర్చల్లో సఫలమైంది ప్రభుత్వమేనని, తాము విఫలమయ్యామని తెలిపారు. ఇది చీకటి ఒప్పందమని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని, తమతో కలిసొచ్చే సంఘాలతో ఆందోళన కొనసాగిస్తామని ప్రకటించారు.
- చర్చల్లో సీపీఎస్ రద్దుపై ఎలాంటి నిర్ణయమూ జరగలేదు.
- హెచ్‌ఆర్‌ఏ శ్లాబులు పునరుద్దరించుకోలేకపోయాం. ఈ విషయంలో గ్రామీణ ప్రాంత ఉద్యోగులకు తీరని అన్యాయం జరిగింది.
- వృద్ధులకు పాత అదనపు పింఛను సాధించుకోలేకపోయాం
- ఐఆర్ ఇచ్చిన తేదీ నుంచి మానిటరీ బెనిఫిట్ ఇవ్వాలనే డిమాండ్‌పై చర్చ జరగనే లేదు
- కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పట్టించుకోలేదు
- 11వ పీఆర్‌సీ నివేదికను చూడలేకపోయాం
- ప్రధాన డిమాండైన ఫిట్‌మెంట్‌ని 27శాతానికి పెంచుకోలేకపోయాం.