ఏపీలో గురువారం నుంచి ఆర్టీసీ సర్వీసులు నడవనున్నాయి. పెద్ద నగరాల్లోనూ బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఆన్‌లైన్‌లో మాత్రమే టికెట్ బుకింగ్‌కు అనుమతి ఇచ్చింది. అన్ని బస్సు సర్వీసుల్లో ఆన్‌లైన్ రిజర్వేషన్ చేసుకునే సౌకర్యం ఉండనుంది.
ఏపీలో ఎల్లుండి నుంచి రోడ్డెక్కనున్న ఆర్టీసీ బస్సులు - ఎల్లుండి నుంచి ఆర్టీసీ ప్రారంభం న్యూస్
ఆంధ్రప్రదేశ్‌లో గురువారం ఉదయం నుంచి ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. దశల వారీగా బస్సులను రోడ్డెక్కించాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయించింది.
ఏపీలో ఎల్లుండి నుంచి రోడ్డెక్కనున్న ఆర్టీసీ బస్సులు
బస్టాండ్లలో ఆన్‌లైన్ రిజర్వేషన్ కౌంటర్ల ఏర్పాటుకు ఆర్టీసీ చర్యలు తీసుకుంటుంది. ఈ మేరకు బస్సులు తిప్పే విషయమై మార్గదర్శకాలను ఆర్టీసీ సిద్ధం చేసింది. పూర్తి వివరాలను ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ప్రకటించనున్నారు. బస్సులతో పాటు ఆటోలు, ప్రైవేటు వాహనాలకు కూడా అనుమతి ఇవ్వనున్నారు.