లాక్‌డౌన్‌తో కుదేలైన ఆర్టీసీని ఆదుకోవాలంటూ కేంద్రాన్ని ఏపీ ఆర్టీసీ యాజమాన్యం కోరింది. బస్సులన్నీ డిపోలకే పరిమితమై రాబడి పూర్తిగా ఆగిందని నివేదించింది. అన్ని రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థల సంఘం (ఏఎస్ఆర్టీయూ) ఇటీవల కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రిత్వ శాఖకు తమ ఆర్థిక పరిస్థితిని నివేదించింది. 12 వేల బస్సులను సంస్థ నడిపేదని, 52 వేల మంది ఉద్యోగులు ఉన్నారని ఆర్టీసీ తెలిపింది.
సంస్థను ఆదుకోవాలంటూ కేంద్రానికి ఏపీఎస్ఆర్టీసీ లేఖ - ఏపీఎస్ఆర్టీసీ తాజా సమాచారం
బస్సులన్నీ డిపోలకే పరిమితమై రాబడి లేక ఇబ్బందులు పడుతున్న ఏపీఎస్ఆర్టీసీని కేంద్రం ఆదుకోవాలంటూ సంస్థ లేఖ రాసింది. ఆర్థిక పరిస్థితి దృష్ట్యా రాబడిలో కొంత మొత్తం ఇవ్వాలని ప్రభుత్వం అడిగింది.
సంస్థను ఆదుకోవాలంటూ కేంద్రానికి ఏపీఎస్ఆర్టీసీ లేఖ
జీతాలు, వివిధ రుణాలు, వడ్డీలు, ఇతర నిర్వహణ ఖర్చుల భారం, 300 కోట్ల వరకూ ఉందని వెల్లడించింది. ఈ మేరకు ఆర్థిక సాయం అందించాలని కోరింది. రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యోగులు ప్రజా రవాణా ఉద్యోగులుగా మారారు. వీరికి జీతాలు ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఆర్థిక పరిస్థితి దృష్ట్యా... రాబడి లో కొంత మొత్తం ఇవ్వాలని ప్రభుత్వం కోరింది.
ఇవీ చూడండి:తెలంగాణలో రెడ్, ఆరెంజ్, గ్రీన్‌జోన్ జిల్లాలివే...