ఏపీఎస్ ఆర్టీసీ విలీనం దిశగా మరో అడుగు పడనుంది. విజయవాడలోని ఆర్టీసీ హౌస్లో ఉదయం 11 గంటలకు సంస్థ పాలక మండలి సమావేశం ప్రారంభం కానుంది. ఆర్టీసీ బోర్డులో సభ్యులైన రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, సంస్థ ఎండీ ఎం.టి.కృష్ణబాబు, ఆర్టీసీ ఈడీలు, రవాణా, ఆర్థిక, కేంద్ర ప్రభుత్వ అధికారులు సహా ఇతర పాలకమండలి సభ్యులు హాజరు కానున్నారు.
ఏపీలో ఆర్టీసీ విలీనం దిశగా ఇవాళ మరో ముందడుగు
ఏపీ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం దిశగా ఇవాళ కీలక ముందడుగు పడనుంది. సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ ఆర్టీసీ పాలక మండలి తీర్మానం చేయనుంది.
apsrtc
విలీనంపై పాలక మండలి తీర్మానం తప్పని సరి కావడం వల్ల.. ఇవాళ ఆ పనిని పూర్తి చేయనున్నారు. సంస్థ పరిరక్షణ కోసం మరిన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని పాలక మండలి కోరనున్నట్లు తెలిసింది. ఆర్టీసీలో వెయ్యి విద్యుత్ బస్సులను ప్రవేశ పెట్టాలని మరో తీర్మానం చేయనుంది. సంస్థను ఆర్థికంగా ఆదుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ బోర్డు సమావేశం కోరనున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: ఆర్టీసీ సంస్థకు కొత్త రూపు తెచ్చేందుకు సర్కారు సన్నాహాలు