APSRTC Employees Unions Strike : పీఆర్సీ జీవోల రద్దు, ఇతర అంశాలపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న సమ్మెలో పాల్గొనాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు నిర్ణయించాయి. పీఆర్సీ సాధన సమితికి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు తెలిపారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.
APSRTC Employees Unions Strike : సమ్మెలో పాల్గొనాలని ఏపీ ఆర్టీసీ కార్మిక సంఘాల నిర్ణయం - ఏపీ ఆర్టీసీ ఉద్యోగ సంఘాల భేటీ
APSRTC Employees Unions Strike: పీఆర్సీ జీవోల రద్దు, ఇతర అంశాలపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న సమ్మెలో పాల్గొనాలని ఏపీ ఆర్టీసీ కార్మిక సంఘాలు నిర్ణయించాయి. పీఆర్సీ సాధన సమితికి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు తెలిపారు.

AP PRC Issue : ఉద్యమంలో ఆర్టీసీ సంఘాలు కీలక పాత్ర పోషిస్తాయని.. అన్ని రకాల ఆందోళనలకు పూర్తిగా మద్దతిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికులను విలీనం చేస్తే మంచి జరుగుతుందని భావించామని.. విలీనానికి ఎందుకు అంగీకరించామా అని ఇప్పుడు ఆలోచించే పరిస్థితి వచ్చిందన్నారు. ఉన్న సౌకర్యాలు కోల్పోతుంటే విలీనం ఇదేనా? అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. రివర్స్ పీఆర్సీతో జీతాలు తగ్గే పరిస్థితి ఎదురైందని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!