APSRTC SPECIAL BUSES FOR DUSSEHRA : దసరాకు సొంతూళ్లకు వెళ్లేవారి కోసం ఆర్టీసీ ఈ నెల 29 నుంచి వచ్చే నెల 10 వరకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. విజయవాడ నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నైతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు 1,081 అదనపు బస్సులు ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేయకూడదని ఆర్టీసీ నిర్ణయించింది.
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. దసరా పండుగ కోసం ప్రత్యేక బస్సులు
APSRTC SPECIAL BUSES FOR DUSSEHRA : దసరా పండుగ కోసం సొంతూళ్లకు వెళ్లేవారి కోసం ఏపీఎస్‌ఆర్టీసీ (ఆంధ్రప్రదేశ్‌రోడ్డు రవాణా సంస్థ) శుభవార్త చెప్పింది. అందుకోసం ఈ నెల 29 నుంచి వచ్చే నెల 10 వరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలిపింది. అయితే ఈసారి ప్రత్యేక బస్సులలో అదనపు ఛార్జీలు వసూలు చేయట్లేదని ప్రకటించింది.
ప్రయాణికులకు గుడ్ న్యూస్
ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ ఛార్జీలే వసూలు చేస్తామన్న ఆర్టీసీ అధికారులు.. ప్రత్యేక బస్సుల్లోని టికెట్లకూ రిజర్వేషన్ సదుపాయం కల్పించారు. ఏపీఎస్‌ఆర్టీసీ వెబ్‌సైట్‌లో ఈ ప్రత్యేక బస్సుల వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు.
ఇవీ చదవండి: