నష్టాలు వస్తోన్న దృష్ట్యా బస్సుల్లో ప్రయాణికులను అనుమతి విషయమై నిబంధనలను ఏపీఎస్ఆర్టీసీ సడలించింది. ఏపీ ప్రభుత్వ ఆదేశాల మేరకు నూతన మార్గదర్శకాలను అమలు చేయాలని అన్ని జిల్లాల ఆర్ఎంలకు ఎండీ కృష్ణబాబు ఆదేశాలు జారీ చేశారు. అన్ని దూరప్రాంత రిజర్వేషన్ సర్వీసుల్లో పూర్తి స్థాయిలో సీట్లలో ప్రయాణికులను అనుమతి ఇవ్వనుంది ఆర్టీసీ. పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్లో దశలవారీగా పునరిద్ధరించాలని ఆదేశాల్లో తెలిపారు. ఈ మేరకు ఓపీఆర్ఎస్లో మార్పులు చేయాలని అన్ని జిల్లాల ఆర్ఎంలకు ఆర్టీసీ ఎండీ ఆదేశించారు.
లాక్డౌన్ అనంతరం మే 21 నుంచి అన్ని బస్సు సర్వీసులను పునరుద్ధరించిన ఆర్టీసీ.. కరోనా వ్యాప్తి చెందకుండా 50 శాతం లోపు సీట్లలో మాత్రమే ప్రయాణికులను అనుమతిస్తోంది. ఇకపై బస్సుల్లో ఆమోదించిన రిజిస్టర్డ్ సీటింగ్ సామర్థ్యం పునరుద్ధరణ చేస్తున్నట్లు ఆర్టీసీ తెలిపింది. రిజర్వేషన్ లేని పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ & మెట్రో ఎక్స్‌ప్రెస్‌లో రిజిస్టర్డ్ సీటింగ్ లేఅవుట్ దశలవారీగా పునరుద్ధరణ చేయనున్నట్లు ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు తెలిపారు.