APSRTC Special Buses: సంక్రాంతి పండగ రద్దీ దృష్ట్యా ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. పలు ప్రాంతాలకు 6,970 ప్రత్యేక బస్సులను నడపనుంది. ఈనెల 8 నుంచి 17 వరకు ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది. పండగ ముందు 4,145 బస్సులు, తర్వాత తిరుగు ప్రయాణానికి 2,825 ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేసినట్లు అధికారులు తెలిపారు.
హైదరాబాద్కు రద్దీ ఎక్కువగా ఉంటుందని భావించిన అధికారులు.. ఏపీలోని పలు ప్రాంతాల నుంచి భాగ్యనగరానికి 2,500 బస్సులు ఏర్పాటు చేశారు. పండగ ముందు, తర్వాత రోజుల్లో ఈ బస్సులు నడవనున్నాయి. చెన్నై కి 120, బెంగళూరు 300, విజయవాడకు 600 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల నుంచి విశాఖపట్నానికి 850 బస్సులు, ఇతర ప్రాంతాలకు 2,600 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.