రాష్ట్ర శాసనసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. నేటి సభలో పలు బిల్లులకు సభ్యులు ఆమోదం తెలిపారు. మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పింఛను పెంపు బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. కనీస పింఛను రూ.50వేలు, గరిష్ఠ పింఛను రూ.70వేలకు పెంచారు.
శాసనసభలో పలు బిల్లులకు ఆమోదం - telangana assembly sessions 2021
తెలంగాణ శాసనసభ సమావేశాల్లో నేడు పలు బిల్లులు ఆమోదం పొందాయి. మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పింఛను పెంపు, ఉద్యోగ విరమణ వయోపరిమితి బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.
శాసనసభలో పలు బిల్లులకు ఆమోదం
రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల వైద్య ఖర్చుల పరిమితిని రూ. లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతూ.. వైద్య ఖర్చుల పెంపు బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.
ఉద్యోగ విమరణ వయోపరిమితిని రాష్ట్ర సర్కార్ 61 ఏళ్లకు పెంచింది. ఈ బిల్లును శాసనసభ ఆమోదించింది.
- ఇదీ చదవండి :స్వచ్ఛ నగరంగా భాగ్యనగరం : మంత్రి కేటీఆర్