ఎనిమిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులను యువ శాస్ర్తవేత్తలుగా తీర్చిదిద్దేందుకు నిర్వహించే జాతీయ స్థాయి 'యంగ్ సైంటిస్ట్ ఇండియా కాంపిటీషన్' ఏడో విడతను బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్‌లోని టెక్నాలజీ బిజినెస్ ఇంక్యూబేటర్(టీబీఐ) ప్రకటించింది. దీనికోసం స్పేస్ కిడ్స్ ఇండియాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ కార్యక్రమం ద్వారా అధునాతన ల్యాబ్‌లలో విద్యార్థులు పనిచేసి, అంతర్జాతీయంగా ప్రతిభను ప్రదర్శించుకోవచ్చని టీబీఐ తెలిపింది.
'యంగ్ సైంటిస్ట్ ఇండియా కాంపిటీషన్'కు దరఖాస్తుల ఆహ్వానం - యంగ్ సైంటిస్ట్ ఇండియా కాంపిటీషన్‌కు దరఖాస్తుల ఆహ్వానం
హైదరాబాద్‌లోని బిట్స్ పిలానీ ఏడో విడత 'యంగ్ సైంటిస్ట్ ఇండియా కాంపిటీషన్'ను ప్రకటించింది. ఎనిమిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులను యువ శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దనున్నట్టు తెలిపింది.
'యంగ్ సైటింస్ట్ ఇండియా కాంపిటీషన్'కు దరఖాస్తుల ఆహ్వానం
స్పేస్ కిడ్స్ ఇప్పటికే 12 బెలూన్ సాటిలైట్స్, 3 సబ్ ఆర్బిటల్ శాటిలైట్స్, 1 ఆర్బిటల్ శాటిలైట్ ప్రయోగించినట్లు వెల్లడించింది. నీతి ఆయోగ్, హెక్జా వేర్ ఈ కాంపిటీషన్‌కు మద్దతివ్వటం సంతోషకరమని స్పెస్ కిడ్స్ వ్యవస్థాపకులు తెలిపారు. 15 డిసెంబర్ వరకు స్పేస్ కిడ్స్ వెబ్సైట్లో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని టీబీఐ ప్రకటించింది.
ఇదీ చూడండి:'ఆగస్టు కల్లా 25 కోట్ల మందికి కొవిడ్ టీకా'
Last Updated : Nov 5, 2020, 9:12 AM IST