నటుడు సాయిధరమ్ తేజ్ ఆరోగ్యంపై అపోలో ఆసుపత్రి వైద్యులు తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. సాయి తేజ్‌కు వెంటిలేటర్ తొలగించామని తెలిపారు. సొంతంగా శ్వాస తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. పూర్తిగా కోలుకున్నారని వెల్లడించాయి. తేజ్‌ను ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి మార్చామని తెలిపారు.
Sai Dharam Tej accident: మెగా అభిమానులకు శుభవార్త... కోలుకున్న సాయిధరమ్ తేజ్ - తెలంగాణ వార్తలు
మెగా అభిమానులకు అపోలో ఆసుపత్రి వైద్యులు శుభవార్త తెలిపారు . రోడ్డు ప్రమాదంలో గాయపడి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హీరో సాయిధరమ్ తేజ్ పూర్తిగా కోలుకున్నారని వెల్లడించాయి.
సాయిధరమ్ తేజ్
నగరంలోని కేబుల్ బ్రిడ్జ్-ఐకియా సమీపంలో స్పోర్ట్స్ బైక్‌పై ప్రయాణిస్తున్న సాయితేజ్ ప్రమాదవశాత్తూ కిందపడిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. అప్పటి నుంచి హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇదీ చదవండి:Pubs in Hyderabad: యువతకు మరో ప్రపంచమది.. అక్కడ చీకటి పడ్డాకే అసలు కథ షురూ