APNGO State President Comments: జగన్ ప్రభుత్వంపై ఏపీఎన్జీవో ఏపీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. 'నేను విన్నాను.. నేను ఉన్నాను' అనే మాయ మాటలు విని వైకాపాకు 151 సీట్లు కట్టబెట్టామని ఉద్యోగుల అంతర్గత సమావేశంలో వ్యాఖ్యనించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
"చచ్చిపోయే ముందు దీపం బాగా వెలుగుతుంది. అటువంటిదే మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్‌ల గెలుపు. ఉద్యోగులంటే ఏంటో చంద్రబాబుకు బాగా తెలుసు. రాష్ట్రవ్యాప్తంగా 13 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ఒక్కొక్క ఉద్యోగి కుటుంబంలో 5 ఓట్లు ఉన్నా.. సుమారు 60 లక్షల ఓట్లతో ప్రభుత్వాన్ని కూల్చవచ్చు. ప్రభుత్వాన్ని నిలబెట్టనూవచ్చు. ఈ శక్తి ముందు ఎవరైనా తలవంచాల్సిందే. ఉద్యమం ద్వారానే హక్కులను సాధించుకుంటాం. వైకాపా ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపై కాదు. ఉద్యోగులు చచ్చిపోతున్నా.. జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది."