తెలంగాణ

telangana

ETV Bharat / city

తెలంగాణ హైకోర్టులో పిటిషన్​ను ఉపసంహరించుకున్న ఏపీ జెన్​కో

తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను ఏపీ జెన్‌కో ఉపసంహరించుకుంది. తమకు చెల్లించాల్సిన రూ.6,283 కోట్ల బకాయిలను తిరిగి రాబట్టుకునేందుకు విభజన సమస్యల పరిష్కార కమిటీని ఆశ్రయిస్తామని ఏపీ జెన్‌కో హైకోర్టుకు తెలిపింది.

ap genco
తెలంగాణ హైకోర్టులో పిటిషన్​ను ఉపసంహరించుకున్న ఏపీ జెన్​కో

By

Published : Jun 10, 2022, 4:05 AM IST

విద్యుత్ బకాయిల వివాదంపై గతంలో తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్​ను ఏపీ జెన్‌కో ఉపసంహరించుకుంది. తమకు చెల్లించాల్సిన రూ.6,283 కోట్ల బకాయిలను తిరిగి రాబట్టుకునేందుకు విభజన సమస్యల పరిష్కార కమిటీని ఆశ్రయిస్తామని ఏపీ జెన్‌కో హైకోర్టుకు తెలిపింది. ఈ మేరకు పిటిషన్‌ వెనక్కి తీసుకునేందుకు అనుమతివ్వాలని ధర్మాసనాన్ని కోరింది. ఇందుకు అంగీకరించిన హైకోర్టు ధర్మాసనం.. పిటిషన్‌ వెనక్కి తీసుకునేందుకు అనుమతించింది.

అంతకుముందు విచారణ సందర్భంగా ఏపీ జెన్‌కో, తెలంగాణ జెన్‌కో మధ్య వాడివేడి చర్చ జరిగింది. ఏపీ జెన్‌కో తరచూ పలు రకాల పిటిషన్లు వేస్తూ వేధిస్తోందని తెలంగాణ జెన్‌కో తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఏపీ జెన్‌కోనే తెలంగాణ జెన్‌కోకు రూ.12,940 కోట్లు చెల్లించాల్సి ఉందని, దీనిపై న్యాయస్థానమే నిజానిజాలు తేల్చాలని కోరారు. ఈ నేపథ్యంలో పిటిషన్‌ ఉపసంహరణకు ఏపీ జెన్‌కో చేసుకున్న విజ్ఞప్తిని తిరస్కరించాలని కోర్టుకు విన్నవించారు. ఇరుపక్షాల వాదనలు విన్న సీజే జస్టిస్‌ సతీశ్‌ చంద్ర ధర్మాసనం, పిటిషన్‌ ఉపసంహణకు అనుమతి ఇచ్చింది.

ఇదీ చదవండి:మహిళల భద్రతపై సర్కార్​ ఫోకస్​.. హైదరాబాద్​లో సిటీ పోలీస్ యాక్ట్ అమలు..

ABOUT THE AUTHOR

...view details