తెలంగాణ విద్యుత్ బకాయిలపై ఆ రాష్ట్ర హైకోర్టులో ఏపీ జెన్‌కో పిటిషన్ దాఖలు చేసింది. రూ.6,283 కోట్ల మేర తెలంగాణ ప్రభుత్వం బకాయి పడినట్లు పిటిషన్లో పేర్కొంది. ఎన్‌సీఎల్‌టీలో పిటిషన్ ఉపసంహరించుకున్న ఏపీ జెన్‌కో.. దీనిపై మాత్రం హైకోర్టును ఆశ్రయించింది.
AP Petition: 'తెలంగాణ ప్రభుత్వం రూ.6283 కోట్లు బాకీ ఉంది' - APGENCO PETITION OVER TELANGANA
తెలంగాణ చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలపై రాష్ట్ర హైకోర్టులో ఏపీ జెన్‌కో పిటిషన్ దాఖలు చేసింది. ఏపీకి రూ.6,283 కోట్ల మేర రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని పిటిషన్లో పేర్కొంది. ఎన్‌సీఎల్‌టీలో పిటిషన్ ఉపసంహరించుకున్న ఏపీ జెన్‌కో.. దీనిపై కోర్టును ఆశ్రయించింది.
తెలంగాణ హైకోర్టులో ఏపీ జెన్‌కో పిటిషన్
విద్యుత్ బకాయిలు చెల్లించేలా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఏపీ జెన్‌కో హైకోర్టును కోరింది. జెన్‌కో దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన కోర్టు.. కౌంటరు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబరు 28కి వాయిదా వేసింది.
ఇదీ చదవండి:CM KCR REVIEW: 'వచ్చే ఏడాది నుంచి బడ్జెట్‌లో దళిత బంధుకు రూ.20 వేల కోట్లు'