జలవివాదాలపై అపెక్స్ కౌన్సిల్ భేటీకి రంగం సిద్ధం - జలవివాదాలపై అపెక్స్ కౌన్సిల్ భేటీ
17:18 May 21
జలవివాదాలపై అపెక్స్ కౌన్సిల్ భేటీకి రంగం సిద్ధం
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య జలవివాదాలపై అపెక్స్ కౌన్సిల్ సమావేశం త్వరలో జరగనుంది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ రెండు రాష్ట్రాలకు సమాచారం పంపింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కమిటీలో సభ్యులుగా ఉంటారు. కృష్ణా, గోదావరి జలాల అంశానికి సంబంధించి ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకొంది.
ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శికి కేంద్ర జలశక్తి శాఖ అండర్ సెక్రటరీ ఏ.సి.మల్లిక్ లేఖ రాశారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం కోసం ఎజెండా అంశాలను పంపాలని రెండు రాష్ట్రాలను కోరారు. ఈ విషయాన్ని అత్యవసరంగా పరిగణించాలని తెలిపారు. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఛైర్మన్లకు కూడా సమాచారం పంపారు.