తెలంగాణలో మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ.. తమ మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడారని ఏపీ తెరాస నాయకుడు కొణిజేటి ఆదినారాయణ అన్నారు. "ప్రజా ఉద్యమం చేసి తెలంగాణ సాధించిన కేసీఆర్పై వ్యాఖ్యలు చేయటం సరికాదు" అన్నారు.
బొడిగ శోభపై ఏపీ తెరాస నేత మండిపాటు.. విజయవాడ సీపీకి ఫిర్యాదు - ఏపీ టీఆర్ఎస్ లీడర్ కొణిజేటీ ఆదినారాయణ వార్తలు
రాష్ట్ర ముఖ్యమంత్రిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే బోడిగ శోభపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. ఏపీ తెరాస నేత కొణిజేటి ఆదినారాయణ డిమాండ్ చేశారు. ఏపీలోని విజయవాడ సీపీ శ్రీనివాసులుకు ఈ విషయమై ఫిర్యాదు చేశారు. భాజపా పాలిత రాష్ట్రాల్లోనూ నిరుద్యోగం ఉందని చెప్పారు.
బొడిగ శోభపై ఏపీ తెరాస నేత మండిపాటు.. విజయవాడ సీపీకి ఫిర్యాదు
భాజపా పాలించే రాష్ట్రాల్లో సైతం నిరుద్యోగం ఉందని ఆయన పేర్కొన్నారు. ఏపీలోని విజయవాడ సీపీ శ్రీనివాసులును కలిసి.. శోభ వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకోవాలని కోరారు.