ap teacher unions: ఏపీ ఉపాధ్యాయ సంఘాలు తమ పోరాటాన్ని ఉద్ధృతం చేసేందుకు సిద్ధమయ్యాయి. ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఇవాళ విజయవాడలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించిన ఉపాధ్యాయ సంఘాల నేతలు భవిష్యత్ ఉద్యమ కార్యాచరణపై చర్చించారు. ఈ సమావేశానికి పీడీఎఫ్ ఎమ్మెల్సీలు కూడా హాజరయ్యారు. కలిసి వచ్చే అన్ని ఉద్యోగ సంఘాలను కలుపుకొని ముందుకు వెళ్లేందుకు నిర్ణయించినట్టు నేతలు తెలిపారు. కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ జేఏసీ నేతలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.
AP PRC: ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన ఉపాధ్యాయ సంఘాలు - ap Teacher unions protest for PRC
ap teacher unions: ఏపీలో ఉపాధ్యాయ సంఘాలు తమ కార్యాచరణను ప్రకటించాయి. విజయవాడలో సమావేశమైన పలు సంఘాల నేతలు.. వివరాలను వెల్లడించారు. ఈ నెల 14, 15 తేదీల్లో సీఎంను కలిసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.
సీపీఎస్ రద్దు చేయాలి - ఫ్యాఫ్టో
సీపీఎస్ రద్దు చేస్తూ ప్రభుత్వం ప్రకటన చేయాలని ఫ్యాప్టో అధ్యక్షుడు సుధీర్ బాబు డిమాండ్ చేశారు. ఫిట్ మెంట్ 27 శాతం ఇవ్వాలని, ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని కోరారు. పొరుగుసేవల ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ, డీఏ, టీఏ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఫ్యాప్టో కార్యదర్శి శరత్ చంద్ర మీడియాకు వెల్లడించారు. తమ కార్యాచరణపై ఈనెల 14న సీఎస్‌కు నోటీసు ఇవ్వనున్నట్టు చెప్పారు.
- ఈనెల 14, 15న సీఎంను కలిసేందుకు ప్రయత్నాలు
- ఈనెల 15 నుంచి 20 వరకు పీఆర్సీ పునఃసమీక్షకు సంతకాల సేకరణ
- ఈనెల 21-24 మధ్య ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనర్లతో బ్యాలెట్ల నిర్వహణ
- మంత్రులకు, ఎమ్మెల్యేలకు విజ్ఞాపనలు
- ఈనెల 25న ప్రభుత్వానికి బహిరంగ లేఖ
- మార్చి 2, 3న కలెక్టరేట్ల వద్ద రిలే నిరాహార దీక్షలు
ఇదీ చదవండి:మోదీ సర్కారు అవినీతి బాగోతాల చిట్టా నా దగ్గరుంది: సీఎం కేసీఆర్