ఏపీ మాజీ మంత్రి, టీడీఎల్పీ ఉప నేత, టెక్కలి ఎమ్మెల్యే కింజరావు అచ్చెన్నాయుడిని ఆ రాష్ట్ర అవినీతి నిరోధకశాఖ(ఏసీబీ) అధికారులు అరెస్టు చేశారు. తెదేపా ప్రభుత్వం హయంలో ఈఎస్‌ఐ మందుల కొనుగోళ్లకు సంబంధించిన ఆరోపణలపై ఏసీబీ దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో ఈరోజు ఉదయం 7.20 గంటలకు శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలోని తననివాసంలో ఉండగా అచ్చెన్నాయుడిని ఏసీబీ అదుపులోకి తీసుకుంది. అచ్చెన్నాయుడితో సహా ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఐదు నిమిషాల్లో మొత్తం ప్రక్రియ పూర్తి చేసిన ఏసీబీ ప్రత్యేక బృందాలు అచ్చెన్నాయుడిని అదుపులోకి తీసుకుంటున్న సమయంలో గన్‌మెన్‌ను కూడా అనుమతించలేదు.
ఏపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టు - తెదేపా నేత అచ్చెన్నాయుడు అరెస్టు
ఏపీ మాజీ మంత్రి ఎమ్మెల్యే కింజరావు అచ్చెన్నాయుడిని అవినీతి నిరోధకశాఖ(ఏసీబీ) అధికారులు అరెస్టు చేశారు. ఈరోజు ఉదయం 7.20 గంటలకు శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలోని తననివాసంలో ఉండగా అచ్చెన్నాయుడిని ఏసీబీ అదుపులోకి తీసుకుంది.
తెదేపా ప్రభుత్వంలో అచ్చెన్నాయుడు కార్మికశాఖ మంత్రిగా పనిచేశారు. ఈఎస్‌ఐ ఆసుపత్రులకు సంబంధించి మందులు, వైద్య పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు చోటు చేసుకున్నాయని వైకాపా ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్ మెంట్ దర్యాప్తునకు ఆదేశించింది. ఈఎస్‌ఐలో అవినీతి జరిగినట్లు విజిలెన్స్ దర్యాప్తులో తేలింది. నకిలీ కొటేషన్లతో ఆర్డర్లు ఇచ్చినట్టు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. విజిలెన్స్ కమిటీ నివేదిక ఆధారంగా ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.
ఇవీచూడండి:వాగులు వంకలు దాటి.. అంబులెన్స్ చేరి..