ఏపీ తెలుగుదేశం పార్టీ... తన కార్యకర్తలకు డబ్బులిచ్చి మద్యం దుకాణాల వద్ద క్యూల్లోకి పంపుతోందని మంత్రి పేర్ని నాని ఆరోపించారు. వారే భౌతికదూరం పాటించకుండా, మాస్కులు లేకుండా గందరగోళం చేస్తున్నారని పేర్కొన్నారు. తెదేపా క్షుద్ర రాజకీయం చేస్తోందని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిందన్నారు. మద్యం అమ్మకాలకు సంబంధించి ప్రతిపక్షాల విమర్శలపై స్పందించిన మంత్రి... బ్రాందీ షాపులు తీయమన్నది ప్రధాని మోదీనే అని వివరించారు. ప్రధానిపై ఎందుకు విమర్శలు చేయలేకపోతున్నారని తెదేపాను మంత్రి ప్రశ్నించారు.
మోదీకి ప్రేమ సందేశం కోసమే...
జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు, మోదీకి ప్రేమ సందేశం పంపడానికే చంద్రబాబు మీడియా సమావేశం పెట్టారని ఎద్దేవా చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పని తీరును పక్క రాష్ట్రాల సీఎంలు ప్రశంసించారని అన్నారు. మరోవైపు 'మద్యం దుకాణాలు వద్ద ఉపాధ్యాయల విధులు' వివాదంపైనా ఆయన స్పందించారు. మద్యం దుకాణాల వద్ద ఉపాధ్యాయులను ఉంచలేదని స్పష్టం చేశారు. కొన్ని జిల్లాల్లో వారే స్వచ్ఛందంగా పనిచేస్తున్నారని మంత్రి పేర్ని నాని వెల్లడించారు. ఎక్కడైనా తప్పు జరిగి ఉంటే సరిదిద్దుతామన్నారు.
'ఏపీలో మద్యం దుకాణాల వద్ద రద్దీకి తెదేపానే కారణం' ఇవీ చూడండి : గ్రామాలు, మండల కేంద్రాల్లో అన్ని దుకాణాలకు అనుమతి