తెలంగాణ

telangana

ETV Bharat / city

నవంబర్ 1న ఏపీ అవతరణ దినోత్సవం - ఏపీ లెటెస్ట్ న్యూస్

నవంబర్ ఒకటో తేదీని అవతరణ దినోత్సవంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అవతరణ వేడుకలు నిర్వహణకు ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారు కృష్ణ మోహన్ నేతృత్వంలో, పర్యాటక సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ సహా 9 మందితో కమిటీని ఏర్పాటుచేసింది.

ap government
నవంబర్ 1న ఏపీ అవతరణ దినోత్సవం

By

Published : Oct 28, 2020, 9:03 AM IST

నవంబరు 1న అవతరణ దినోత్సవం నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ రాష్ట్ర రాజధాని, జిల్లా కేంద్రాల్లోనూ ఏపీ అవతరణ దినోత్సవం జరపాలని ఆదేశాలు ఇచ్చింది. ఏపీ వ్యాప్తంగా ఈ వేడుకలు నిర్వహించేందుకు ప్రభుత్వ మీడియా సలహాదారు జీవీడీ కృష్ణ మోహన్ నేతృత్వంలో పర్యాటక సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ సహా 9 మంది అధికారులతో కూడిన కమిటీని నియమిస్తూ ఆదేశాలు ఇచ్చింది.

జిల్లాల్లో అవతరణ దినోత్సవం నిర్వహించాల్సిందిగా కలెక్టర్​లకు సూచనలు ఇచ్చింది. 2014 నుంచి 2018 వరకు జూన్ 2 తేదీ.. అపాయింటెడ్​ డే రోజున గత ప్రభుత్వం నవనిర్మాణ దీక్షలు నిర్వహించింది. గత ఏడాది నవంబర్ 1న ఏపీ అవతరణ దినోత్సవ వేడుకలకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఇవీచూడండి:నేడు ఎడ్‌సెట్‌ ఫలితాల వెల్లడి

ABOUT THE AUTHOR

...view details