తెలంగాణ

telangana

By

Published : Nov 23, 2020, 10:38 PM IST

ETV Bharat / city

ఏపీ ఎస్​ఈసీ, సీఎస్ మధ్య లేఖల పరంపర

ఏపీ ఎస్​ఈసీ, సీఎస్ మధ్య లేఖల పరంపర కొనసాగుతోంది. తాజాగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్, సీఎస్ నీలం సాహ్నికి మరో లేఖ రాశారు. రాష్ట్ర ఎన్నికల సంఘానికి సహకరించాలని ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రతిని ఎస్​ఈసీ లేఖతో జత చేశారు. ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం సహకారం తప్పనిసరి అని కోర్టు చెప్పిన విషయాన్ని నిమ్మగడ్డ సీఎస్​కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

ఏపీ ఎస్​ఈసీ, సీఎస్ మధ్య లేఖల పరంపర
ఏపీ ఎస్​ఈసీ, సీఎస్ మధ్య లేఖల పరంపర

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ మరోసారి లేఖ రాశారు. ఎస్‌ఈసీకి ప్రభుత్వం సహకరించాలన్న హైకోర్టు తీర్పు కాపీని కమిషనర్ లేఖతో జత చేశారు. హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు కాపీ ఇవాళ విడుదలైంది. ఆ తీర్పులో రాజ్యాంగ సంస్థలకు ప్రభుత్వం సహకరించాలని హైకోర్టు పేర్కొంది. ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వ సహకారం తప్పనిసరిగా ఉండాలని కోర్టు తెలిపింది. ప్రభుత్వ సహకారంపై మళ్లీ నివేదిక ఇవ్వాలని ఎస్‌ఈసీని హైకోర్టు ఆదేశించింది. ఈ విషయాన్నే ఎస్​ఈసీ... సీఎస్​కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details