ఏపీ సభాపతి తమ్మినేని సీతారాంకి త్రుటిలో ప్రమాదం తప్పింది. శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో సీఎం వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొని.. తిరిగి వెళ్తుండగా ఆమదాలవలస మండలం వంజంగి వద్ద ఆటోను తప్పించబోయి సాగునీటి కాలువలోకి కారు దూసుకువెళ్లింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. దీంతో వేరే వాహనంలో తమ్మినేని ఇంటికి చేరుకున్నారు.
ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాంకి త్రుటిలో తప్పిన ప్రమాదం - speaker tammineni car accident
ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాంకి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు ఆటోను తప్పించబోయి సాగునీటి కాల్వలోకి దూసుకెళ్లింది. డ్రైవర్ అప్రమత్తతతో ప్రమాదం తప్పింది.
ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాంకి తృటిలో తప్పిన ప్రమాదం