ఆంధ్రపదేశ్‌లో నిర్వహించబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ప్రసాద్ పలు కీలక సూచనలు చేశారు.
ఎన్నికల సిబ్బందికి రక్షణ కల్పించండి: ఏపీ ఎస్‌ఈసీ - తెలంగాణ వార్తలు
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో నిర్వహించబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం పలు సూచనలు చేసింది. ఉద్యోగులకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సిబ్బందికి వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యత ఇవ్వాలని కోరింది.
ఎన్నికల సిబ్బందికి రక్షణ కల్పించండి: ఏపీ ఎస్‌ఈసీ
గ్రామ పంచాయతీ ఎన్నిక ప్రక్రియలో పాల్గొనే ఉద్యోగుల రక్షణకు చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ప్రసాద్ కోరారు. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా సిబ్బందికి శానిటైజర్, మాస్క్‌లు సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు. ఫ్రంట్‌లైన్ వారియర్స్‌తోపాటు సిబ్బందికి కరోనా వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వానికి విన్నవించారు.
ఇదీ చదవండి:జీహెచ్‌ఎంసీ కొత్త పాలకమండలికి సంక్రాంతి తర్వాత గెజిట్ నోటిఫికేషన్!