ఏపీ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ వ్యవహారంపై ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మరోసారి సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌కు లేఖ రాశారు. ప్రవీణ్ ప్రకాశ్‌ను తొలగించాలన్న తన ఆదేశాలు అమలుకాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
'తీవ్ర పరిణామాలు తప్పవు'... ఏపీ సీఎస్‌కు ఎస్ఈసీ నిమ్మగడ్డ హెచ్చరిక - AP IAS praveen prakash latest news
ఏపీ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ తొలగింపు ఆదేశాలు అమలుకాకపోవడంపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రవీణ్ ప్రకాశ్ వ్యవహారంపై సీఎస్‌కు మరో లేఖ రాశారు. ఎస్‌ఈసీ ఆదేశాలు అమలు చేయకపోవడం చట్టవిరుద్ధమని... తన ఆదేశాల ఉల్లంఘనపై తీవ్ర పరిణామాలు తప్పవన్న స్పష్టం చేశారు.
AP SEC
ఎస్ఈసీ ఆదేశాలు అమలు చేయకపోవడం చట్ట విరుద్ధమని లేఖలో స్పష్టం చేశారు. ఆదేశాల ఉల్లంఘనలపై తీవ్ర పరిణామాలు తప్పవని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ హెచ్చరించారు. ఇది కోర్టు ధిక్కరణ అవుతుందని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి :డీఎంహెచ్‌వో నరేష్ భార్యకు గ్రూప్-1 ఉద్యోగం