తెలంగాణ

telangana

ETV Bharat / city

అధికారులపై చర్యలు తీసుకోండి: ఏపీ సీఎస్, డీజీపీకి నిమ్మగడ్డ లేఖ

ఏపీ సీఎస్‌ ఆదిత్యనాథ్ దాస్‌, డీజీపీ గౌతం సవాంగ్​కు ఆ రాష్ట్ర ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ లేఖ రాశారు. విధి నిర్వహణలో అలసత్వం వహించిన 9 మంది అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ap-sec-nimmagada-ramesh-letter-to-cs-and-dgp-to-take-action-on-nine-officials
అధికారులపై చర్యలు కోరుతూ ఏపీ సీఎస్, డీజీపీకి నిమ్మగడ్డ లేఖ

By

Published : Jan 22, 2021, 7:57 PM IST

కళంకిత అధికారులను కొనసాగిస్తే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఏపీ ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అన్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహించిన 9 మంది అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆ రాష్ట్ర సీఎస్ ఆదిత్యనాథ్, డీజీపీ గౌతమ్ సవాంగ్​కు లేఖ రాశారు. ఎస్​ఈసీ పేర్కొన్న అధికారుల్లో గుంటూరు, చిత్తూరు కలెక్టర్లు, తిరుపతి అర్బన్‌ ఎస్పీ, పలమనేరు, శ్రీకాళహస్తి డీస్పీలు, మాచర్ల, పుంగనూరు, రాయదుర్గం, తాడిపత్రి సీఐల పేర్లు ఉన్నాయి.

అధికారులపై చర్యలు కోరుతూ ఏపీ సీఎస్, డీజీపీకి నిమ్మగడ్డ లేఖ

అప్పట్లోనే లేఖ....

గతంలో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత విధి నిర్వహణలో 9 మంది అధికారులు అలసత్వం వహించారని.. వారిపై చర్యలు తీసుకోవాలని అప్పట్లోనే సీఎస్‌, డీజీపీకి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ లేఖ రాశారు. అయితే వారిని ఎన్నికల విధుల నుంచి తొలగించకపోవడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు. రేపటి నుంచి పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ ప్రక్రియ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో 9 మంది అధికారులను ఎన్నికల విధుల నుంచి తొలగించాలని సూచించారు. ఆయా స్థానాల్లో మూడేసి చొప్పున పేర్లు ప్రతిపాదించాలని సీఎస్‌, డీజీపీని లేఖలో ఎస్‌ఈసీ కోరారు.

ABOUT THE AUTHOR

...view details