తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీలో మావోయిస్టులు ప్రవేశించే అవకాశం.. సరిహద్దుల్లో హైఅలర్ట్!

చత్తీస్‌గఢ్‌ ఘటనతో ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగిన నేపథ్యంలో ఏపీలోని విశాఖ జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు.

aob police, vishaka police
ఆంధ్రా ఒడిశా సరిహద్దు, విశాఖ పోలీసులు

By

Published : Apr 5, 2021, 10:51 PM IST

దండకారణ్యం నుంచి ఎలాంటి చొరబాట్లు, హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా ఏపీలోని విశాఖ జిల్లా పోలీసులు గస్తీ చేపట్టారు. బీజాపూర్‌లో ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతం జిల్లా సరిహద్దు నుంచి సుమారు 70 కి.మీ. దూరంలో ఉంది. ఇరుపక్షాల మధ్య ఎదురుకాల్పులు జరిగిన నేపథ్యంలో... మావోయిస్టులు జిల్లా సరిహద్దులు దాటి రాకుండా నిరోధించేందుకు ఒడిశా సరిహద్దు ప్రాంతానికి మరిన్ని బలగాలను పంపించినట్లు సమాచారం.

సరిహద్దులోని మావోయిస్టుల కార్యకలాపాలపై ఏపీ పోలీసులు దృష్టి సారించారు. ప్రస్తుత ఎన్‌కౌంటర్‌లో గాయపడిన, తప్పించుకున్న మావోయిస్టులు ఏపీలోకి చొరబడకుండా చర్యలు చేపట్టినట్లు గూడెం కొత్త‌వీధి సీఐ ముర‌ళీధ‌ర్ తెలిపారు. జవాన్లపై దాడికి పాల్పడిన మావోయిస్టులు అక్కడి నుంచి తప్పించుకుని ఒడిశాలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాల హెచ్చరికలతో రెండు రాష్ట్రాలకు చెందిన పోలీసు బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. సీలేరు తనిఖీ కేంద్రం వద్ద, ఐస్‌గెడ్డ వద్ద బలగాలను మోహరించి తనిఖీలు నిర్వహిస్తున్నారు. సరిహద్దులోకి ప్రవేశించే ప్రతి వాహనాన్ని సోదా చేస్తూ అనుమానితులను ప్రశ్నిస్తున్నారు.

ఇదీ చదవండి:ములుగు జిల్లాలో పోలీసులు అప్రమత్తం

ABOUT THE AUTHOR

...view details