పోలీస్, రక్షణ విభాగంలో స్కోచ్ సంస్థ ప్రకటించిన అవార్డుల్లో ఏపీ పోలీస్ శాఖ వరుసగా 2020, 2021లో జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది. స్కోచ్ జాతీయ సంస్థ ప్రకటించిన మెుత్తం 56 అవార్డులల్లో 23 అవార్డులను ఏపీ పోలీస్ శాఖ సొంతం చేసుకుంది. ఒక స్వర్ణంతో పాటు ఎనిమిది రజత పతకాలను సాధించింది.
Scotch Awards: వరుసగా రెండేళ్లు అగ్రస్థానం.. స్కోచ్ అవార్డులు సొంతం - స్కోచ్ అవార్డులు తాజా వార్తలు
స్కోచ్ జాతీయ సంస్థ ప్రకటించిన అవార్డుల్లో ఏపీ పోలీసులు అగ్రస్థానంలో నిలిచారు. వివిధ విభాగాల్లో 23 అవార్డులు గెలుచుకున్నారు. ఏపీ పోలీస్ శాఖ వరుసగా 2020, 2021లో జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది.
ఏపీ పోలీస్ శాఖకు స్కోచ్ అవార్డులు
మహిళల భద్రత, నిర్ణీత సమయంలో ఛార్జ్షీట్ల దాఖలు, పోలీస్ శాఖ పరిపాలనలో పూర్తి స్థాయి డిజిటలైజేషన్ విధానం, క్లిష్టమైన కేసులను చేధించడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం విభాగాలల్లో అవార్డులు లభించాయి. ఈ సందర్భంగా పోలీసు సిబ్బందిని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అభినందించారు.
ఇదీ చదవండి