వారంతా పొట్టకూటి కోసం ముంబయి వెళ్లారు. ఇప్పుడు లాక్డౌన్లో చిక్కుకుని.. సొంతగూటికి రాలేక ఇబ్బందులు పడుతున్నారు. కడుపున పుట్టిన పిల్లలను బతికించుకోవాలని ఆరాట పడుతున్నారు. తినేందుకు తిండిలేక... చిన్నపిల్లలను పస్తులు ఉంచలేక నరకం అనుభవిస్తున్నారు. జగనన్న దయతలచాలని వేడుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చాలామంది.. పొట్టకూటి కోసం ముంబయి వెళ్లారు. వాణిజ్య రాజధానిలోని వాడీ బందర్ ఏరియాలో నివాసముంటున్నారు. చాలా ఏళ్లుగా అక్కడే పని చేస్తూ.. చాలీచాలని డబ్బుతో బతుకుసాగిస్తున్నారు. ఇప్పుడు కరోనా మహమ్మారి దెబ్బకు నానా అవస్థలు పడుతున్నారు. ఓ వైపు ఉపాధి లేక.. మరోవైపు ఇంట్లో తిండి గింజలు కరవై నరకం చూస్తున్నారు. చిన్నపిల్లలు ఉన్నారని.. ఎలాగైనా ఏపీకి తీసుకెళ్లండంటూ.. ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.