తెలంగాణ

telangana

AP People Comments on OTS Scheme : ప్రభుత్వాలు మారినప్పుడల్లా డబ్బులు చెల్లించాలంటే ఎలా?

AP People Comments on OTS Scheme : ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో ఓటీఎస్ స్కీంపై నిరుపేదలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా డబ్బులు చెల్లించాలంటే ఎలా? అని నిలదీశారు.

By

Published : Jan 22, 2022, 12:27 PM IST

Published : Jan 22, 2022, 12:27 PM IST

AP People Comments on OTS Scheme
AP People Comments on OTS Scheme

AP People Comments on OTS Scheme : 30 ఏళ్ల క్రితమే ఇల్లు నిర్మించి రుణం వాయిదాల రూపంలో చెల్లించేశారు. అప్పు తీరిపోయిందంటూ ప్రభుత్వ సిబ్బంది పాసు పుస్తకాలనూ తీసుకెళ్లారు. అయితే ఆ రశీదుల్ని యజమానులు జాగ్రత్త చేయలేదు. ఇప్పుడు మూడు దశాబ్దాల తర్వాత ప్రభుత్వ సిబ్బంది వచ్చి రూ.9 వేల 480 రుణం చెల్లించాలనడంతో ఇంటి యజమానులు నిర్ఘాంతపోయారు.

AP People Angry on OTS Scheme : ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో ఓ ఇంటికి ఓటీఎస్ స్కీం కింద, రుణం చెల్లించాలంటూ వీఆర్వో నందీశ్వరరావు, గ్రామ సచివాలయ సిబ్బంది రావడంతో ఇంట్లోని వారు ఒక్కసారిగా అవాక్కైయ్యారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా డబ్బులు చెల్లించాలనడం ఏంటని వారిని యజమానులు నిలదీశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ABOUT THE AUTHOR

...view details