తెలంగాణ

telangana

ETV Bharat / city

పల్లె పోరు: మూడో దశ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

మూడో విడత ఏప పంచాయతీ ఎన్నికల నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఇవాళ్టి నుంచి మొదలైంది. ఉదయం10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు.

ap panchayat elections
ap panchayat elections

By

Published : Feb 6, 2021, 2:05 PM IST

ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికల సంఘం పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసింది. మూడు రోజుల పాటు ఉదయం 10.30గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు సర్పంచులు, వార్డు మెంబర్ల ఎన్నికకు నామపత్రాలు స్వీకరిస్తారు. ఈనెల 8వ తేదీ సాయంత్రం 5గంటల వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంటుంది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 20 రెవెన్యూ డివిజన్లలో 160 మండలాల్లో మూడో విడతలో ఎన్నికలు జరగనున్నాయి.

ఈ డివిజన్లలో మాడో ఫేజ్ ఎన్నికలు

శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం, పాలకొండ రెవెన్యూ డివిజన్ల పరిధిలో 9మండలాల్లో, విజయనగరం జిల్లాలోని విజయనగరం రెవెన్యూ డివిజన్‌ పరిధిలో 9 మండలాల్లో, విశాఖపట్నం జిల్లాలోని పాడేరు రెవెన్యూ డివిజన్‌లో 11 మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. తూర్పుగోదావరి జిల్లాలోని రంపచోడవరం, ఎటపాక రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని 11 మండలాల్లో, పశ్చిమగోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెం, ఏలూరు, కక్కునూరు రెవెన్యూ డివిజన్లలోని 11 మండలాల్లో, కృష్ణా జిల్లా మచిలీపట్నం రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని 12 మండలాల్లో, గుంటూరు జిల్లా గురజాల రెవెన్యూ డివిజన్​లోని 9 మండలాల్లో, ప్రకాశం జిల్లాలోని కందుకూరు రెవెన్యూ డివిజన్‌లో 15 మండలాల్లో, నెల్లూరు జిల్లాలోని గూడూరు, నాయుడుపేట రెవెన్యూ డివిజన్లలో 15 మండలాల్లో, కర్నూలు జిల్లాలో ఆదోని, కర్నూలు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 14 మండలాల్లో, అనంతపురం జిల్లాలోని అనంతపురం రెవెన్యూ డివిజన్‌ పరిధిలో 19 మండలాల్లో, కడప జిల్లాలలో.. రాజంపేట, కడప రెవెన్యూ డివిజన్లలోని 11 మండలాల్లో, చిత్తూరు జిల్లాలోని మదనపల్లె రెవెన్యూ డివిజన్‌ పరిధిలో 14 మండలాల్లో మూడో దఫా పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారు.

ఈనెల 17న పోలింగ్‌

ఈనెల 9న నామినేషన్ల పరిశీలన చేపడతారు. ఈనెల 12న మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఈనెల 17న పోలింగ్‌ నిర్వహిస్తారు. అదే రోజు మధ్యాహ్నం 4గంటలకు ఓట్ల లెక్కింపు, అనంతరం ఫలితాలు వెల్లడిస్తారు.

ఇదీ చదవండి:మంత్రి పెద్దిరెడ్డిపై ఎస్‌ఈసీ క్రమశిక్షణ చర్యలు

ABOUT THE AUTHOR

...view details