తెలంగాణ

telangana

ETV Bharat / city

తొలిదఫా ఎన్నికల నోటిఫికేషన్​కు ఎస్​ఈసీ సమాయత్తం - andhra pradesh news

ఏపీలోలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి శనివారం తొలిదఫా ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఎన్నికల నిర్వహణ విషయమై పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులతో ఎస్ఈసీ సమావేశం కానుంది.

తొలిదఫా ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలకు ఎస్​ఈసీ సమాయత్తం
తొలిదఫా ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలకు ఎస్​ఈసీ సమాయత్తం

By

Published : Jan 22, 2021, 4:06 PM IST

ఆంధ్రప్రదేశ్​లో పంచాయతీ ఎన్నికల తొలిదశ నోటిఫికేషన్ విడుదలకు.. ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. రేపు ఉదయం 10 గంటలకు తొలి దఫా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్​ను ఏపీ ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విడుదల చేయనున్నారు.

పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులతో సమావేశం

ఎన్నికల నిర్వహణ విషయమై ఏపీ పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులతో ఎస్ఈసీ సమావేశం కానుంది. సమావేశానికి పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్ హాజరుకానున్నారు. తొలిదశలో నిర్వహించే పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై చర్చించనున్నారు.

ఇదీ చదవండి:'ఎన్నికలకు పదిరోజుల ముందైనా ఓటు నమోదు చేసుకోవచ్చు'

ABOUT THE AUTHOR

...view details