Krishnamraju Smriti Vanam: సినీ, రాజకీయ రంగాల్లో రెబల్ స్టార్ కృష్ణంరాజు సేవలకు గుర్తింపుగా.. ఆయన స్మృతివనం ఏర్పాటు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రులు రోజా, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. కృష్ణంరాజు సంస్మరణ కార్యక్రమం సందర్భంగా మొగల్తూరులోని ఆయన నివాసానికి వచ్చారు. కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ను పరామర్శించారు. వారి కుటుంబానికి సానుభూతి తెలిపారు. కృష్ణంరాజు కుటుంబంతో సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు.
Krishnamraju Smriti Vanam: కృష్ణంరాజు పేరు మీద స్మృతి వనం ఏర్పాటు: మంత్రులు - పశ్చిమ గోదావరి జిల్లా తాజా వార్తలు
Krishnamraju Smriti Vanam: రెబల్‌స్టార్ కృష్ణంరాజు చేసిన సేవలకు గుర్తింపుగా ఆయన పేరుపై స్మృతి వనం ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ మంత్రులు రోజా, వేణుగోపాల కృష్ణమూర్తి తెలిపారు. మొగల్తూరులోని ఆయన నివాసానికి వచ్చిన మంత్రులు.. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కృష్ణంరాజు, ఆయన కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యాన్ని మంత్రులు గుర్తు చేసుకున్నారు.
ఇక కృష్ణంరాజు సంస్మరణ కార్యక్రమానికి ప్రభాస్ రాకతో.. అభిమానులు భారీ సంఖ్యలో మొగల్తూరుకు తరలివచ్చారు. ఇంట్లో నుంచి బయటికి వచ్చిన ప్రభాస్.. అభిమానులకు అభివాదం చేశారు. అందరూ భోజనం చేసి వెళ్లాలని సూచించారు. కృష్ణంరాజు సంస్మరణ కార్యక్రమానికి ప్రభాస్ వస్తున్నారని తెలిసి ఆయన అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దూర ప్రాంతాలనుంచి వచ్చిన అభిమానులతో పాటు చుట్టుపక్కల గ్రామస్థులకు విందు భోజనం ఏర్పాటు చేశారు. అందరూ భోజనం చేసి వెళ్లాలని ప్రభాస్ విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి: